ఒకపక్క వర్షాలు, మరోపక్క కరోనా ప్రభావం ఉన్నప్పటికీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎటువంటి కొరత లేకుండా నిరాంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తున్నామని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వివరించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా అంశాలపై దేశంలోని బొగ్గు కంపెనీ ఛైర్మన్, ఎండీలతో దిల్లీ నుంచి ప్రహ్లాద్ జోషి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సీఎండీ శ్రీధర్ పాల్గొని ఇక్కడి పరిస్థితులు వివరించారు.
గత ఏడాది కన్నా ఈ త్రైమాసిక కాలంలో 16శాతం వర్షం అధికంగా కురిసిందని, దీని ప్రభావం ఓపెన్ కాస్ట్ గనుల ఉత్పత్తిపై కొంతమేర పడిందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి కొంతమేర తగ్గిందని పేర్కొన్నారు. అయితే సింగరేణితో ఒప్పందం ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తున్నమన్నారు. బొగ్గు అవసరమైన ఇతర వినియోగదారులకు ఈ పోర్టల్ ద్వారా సరఫరా చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'