ఏపీలోని అనంతపురం జిల్లా బండమీదపల్లికి చెందిన సింగమనేని నారాయణ మృతిచెందారు. నారాయణ ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాసను విడిచారు. ఆయన పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు, రచయితలు నివాళులర్పించారు.
సింగమనేని నారాయణ ఇప్పటి వరకు 43కు పైగా కథలు రాశారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. రేపు ఉదయం శ్రీనివాస్‌నగర్‌లో అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.
ఇదీ చదవండి: సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: ఆర్.నారాయణమూర్తి