ETV Bharat / city

'సీజనల్​ వ్యాధులపై అప్రమత్తంగా ఉందాం'

సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వారానికోసారి శానిటేషన్‌ పనులు ఎవరి ఇంట్లో వారు చేసుకోవాలన్నారు.

Sherlingampalli MLA Arikapudi Gandhi Attend Pattana Pragati Program At Alwin colony in Kukatpally
సీజనల్​ వ్యాధులపై అప్రమత్తం
author img

By

Published : Jun 4, 2020, 3:47 PM IST

మేడ్చల్​ జిల్లా కూకట్​పల్లి సర్కిల్​లోని ఆల్విన్​ కాలనీ డివిజన్​లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్​ వెంకటేశ్​ గౌడ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు వీధులను శుభ్రం చేశారు. డివిజన్​లో పలుచోట్ల పెండింగ్​లో ఉన్న రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులకు ఆదేశించారు.

కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వారానికోసారి ఇంట్లో నిలువ నీటిని కచ్చితంగా తొలగించుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో కూకట్​పల్లి ఉప కమిషనర్ ప్రశాంతి, హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.