కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ.. 7వ విడత సుందరకాండ పారాయణంను తితిదే నిర్వహించనుంది. ఈ నెల 6వ తేదీన నాదనీరాజనం వేదికపై.. సుందరకాండలోని 25 నుంచి 30వ సర్గ వరకు ఉన్న 194 శ్లోకాలను పారాయణం చేయనున్నారు.
మొత్తం 68 సర్గలకు గాను 2,821 శ్లోకాలు ఉన్నాయి. 16 విడతలుగా వీటిని పారాయణం చేయుటకు తితిదే సంకల్పించింది. ఇప్పటివరకు ఆరు విడతల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.