Fire Accident: వీధిలో పెట్టిన ప్లాస్టిక్ వ్యర్థాల మంట ఓ చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల ముజాహిద్‌కు మంటలు అంటుకుని ఆస్పత్రి పాలయ్యాడు. రోజులాగే ముజాహిద్ తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలకు బయలుదేరాడు. పాఠశాల సమీపంలోని ఓ వీధిలో కాలనీవాసులు ప్లాస్టిక్ వ్యర్థాలను తగులబెట్టారు. అక్కడికి వెళ్లగానే వాళ్లలోని ఓ విద్యార్థి మంటల్లో ఉన్న ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకొని గాలిలో తిప్పాడు.
వెంటనే వ్యాపించిన మంటలు..
ఈ క్రమంలోనే బాటిల్‌కు ఉన్న నిప్పురవ్వలు ప్రమాదవశాత్తు ముజాహిద్ బట్టలపై పడ్డాయి. ప్లాస్టిక్ నిప్పురవ్వలు కావటంతో మంటలు వెంటనే బట్టలకు వ్యాపించాయి. మంటలను చూడగానే విద్యార్థి భయపడి పక్కనే ఉన్న పాఠశాలలోకి పరిగెత్తాడు. ముజాహిద్‌ను గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై.. మంటలను ఆర్పేశారు. దుస్తులు తొలిగించి పెద్దప్రమాదం నుంచి చిన్నారిని బయటపడేశారు. కానీ.. చిన్నారి శరీరంపై చాలా వరకు చర్మం కాలిపోయింది.
గాయాలకు చికిత్స..
గాయపడ్డ చిన్నారిని గ్రామ సర్పంచ్ అజయ్ నాయక్, ఉపాధ్యాయులు హుటాహుటిన శంషాబాద్ లిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి బాగానే ఉందని.. శరీరంపైన చాలా వరకు అయిన గాయాలకు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న షాద్‌నగర్ ఆర్డీఓ రాజేశ్వరి తదితరులతో పాటు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి సుశిందర్ రావు... విద్యార్థిని పరామర్శించారు.
ఇదీ చూడండి: