Srinivas Goud Murder Plan Case: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రకేసులో నిందితులకు ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో నిందితులైన ఏడుగురికి బెయిల్ అంశంపై ఇప్పటికే మేడ్చల్ సెషన్స్ కోర్టులో రెండుసార్లు పిటిషన్ దాఖలు చేశారు. మొదటిసారి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయగా.. రెండోసారి మళ్లీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మార్చి 15న చేపట్టిన విచారణలో.. నిందితులకు బెయిల్ ఇస్తే సాంకేతిక ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని... దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి(మార్చి 31కి) వాయిదా వేసింది.
మొత్తానికి ఏడుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. నిందితులకు రూ.40 వేలు పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే.. వారానికి 2 రోజులు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సంతకాల కోసం హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏడుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉండగా.. సాయంత్రం విడుదలవుతారు.
ఇవీ చూడండి: