ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు, కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 9 నుంచి విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పెంచాలని కోరారు. ఉపకారవేతనాల్లో టీడీఎస్ కట్ చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈనెల 10 నుంచి కొవిడ్ సంబంధిత విధులు బహిష్కరిస్తామని జూనియర్ వైద్యులు తెలిపారు. అనంతరం 11 తేదీ నుంచి అత్యవసర విధుల్లో కూడా పాల్గొనబోమని స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు