ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద బందోబస్తు చర్యలు మరింత పటిష్టం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆందోళనలు, నిరసనలు పెరిగిన నేపథ్యంలో ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారుల సూచనల మేరకు అదనపు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రగతి భవన్ వెలుపల ఉన్న ఇనుప గ్రిల్స్ ఎత్తును కొద్ది రోజుల క్రితమే పెంచారు. తాజాగా ఇప్పుడు ఆ గ్రిల్స్‌కు ఇనుపజాలీ ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడి... అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి...