ETV Bharat / city

జీహెచ్ఎంసీలో గెలిచిన అభ్యర్థులతో గెజిట్.. మిగిలింది మేయర్ ఎన్నికే

author img

By

Published : Jan 17, 2021, 5:53 AM IST

జీహెచ్​ఎంసీ మేయర్‌ ఎన్నిక తేదీపై... నెలాఖరులో స్పష్టత రానుంది. నగర ప్రథమ పౌరుడి ఎన్నికకు నూతన పాలకమండలి ప్రత్యేక సమావేశ తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే నెల 10వరకు ఉండగా ఆ తర్వాత కొత్త కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

sec release gazette notification with ghmc elected corporates
జీహెచ్ఎంసీలో గెలిచిన అభ్యర్థులతో గెజిట్.. మిగిలింది మేయర్ ఎన్నికే

జీహెచ్ఎంసీలో గెలిచిన అభ్యర్థులతో గెజిట్.. మిగిలింది మేయర్ ఎన్నికే

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో... రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 డిసెంబర్ 1న ఎన్నికలు జరగ్గా... 9 వరకు అన్ని డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికలు పూర్తైనా... ప్రస్తుత పాలకమండలి గడవు పూర్తి కాకపోవడం వల్ల రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జీహెచ్ఎంసీకి 2015లో ఎన్నికలు జరిగాక పాలకమండలి ఫిబ్రవరి 11న కొలువుదీరింది. అప్పటి నుంచి ఐదేళ్లపాటు అంటే రానున్న ఫిబ్రవరి 10వరకు గడువు ఉంది. అంతకుముందే మిగతా ప్రక్రియ చేపట్టే వీలులేనందున.... నిబంధనల ప్రకారం నెలలోపు గడువు ఉండేలా ఎస్ఈసీ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రత్యేక సమావేశం

గెజిట్‌ నోటిఫికేషన్‌తో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీని ఖరారు చేసి విడిగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా... తేదీని ఖరారు చేయవచ్చు. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు పాలకమండలిని ప్రత్యేకంగా సమావేశపరుస్తూ నెలాఖరున... ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

కోరం తప్పనిసరి

కలెక్టర్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తారు. ప్రమాణస్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు... తేదీని ప్రకటించి నోటిఫికేషన్ ఇస్తారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యాక చేతులెత్తే విధానంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఎన్నిక ప్రక్రియకు ఎన్నికైన, ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో సగంకంటే ఎక్కువ మంది కోరం తప్పనిసరి. కోరం లేకపోతే మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు. రెండోరోజూ కోరం లేకపోతే... ఆ విషయాన్ని ఎస్ఈసీకి నివేదిస్తారు. ఆ తర్వాత ఎన్నిక కోసం మరోమారు తేదీ ప్రకటిస్తారు. మేయర్ ఎన్నిక జరగకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టే అవకాశం లేదు.

ఇదీ చూడండి: ఇన్నోవేషన్​లో దేశానికే తెలంగాణ ఆదర్శం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.