ETV Bharat / city

Schools Reopened in Telangana : తెలంగాణలో బడి గంట మోగింది - తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం 2022

Schools Reopened in Telangana : తెలంగాణలో బడి గంట మోగింది. కరోనా వ్యాప్తి వల్ల విద్యార్థుల సెలవులు పొడిగిస్తారనే ప్రచారం జరిగినా వాటన్నింటికి చెక్ పెడుతూ పాఠశాలలు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. దాదాపు రెండేళ్ల తర్వాత జూన్​లో బడి ప్రారంభమవుతోంది. లుత నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 ఏడాది నుంచి ఒకేసారి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగనుంది. (విద్యార్థులు కోరుకుంటే తెలుగు మాధ్యమం కూడా ఉంటుంది). విద్యార్థులంతా ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్లారు.

Schools Reopened in Telangana
Schools Reopened in Telangana
author img

By

Published : Jun 13, 2022, 6:18 AM IST

Updated : Jun 13, 2022, 9:23 AM IST

Schools Reopened in Telangana : రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులంతా కేరింతలు కొడుతూ తమ స్నేహితులతో కలిసి బడికి వెళ్లారు. రెండేళ్ల తర్వాత జూన్​లో పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున పాఠశాలలు కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ జాగ్రత్తలు తీసుకున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 ఏడాది నుంచి ఒకేసారి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగనుంది. (విద్యార్థులు కోరుకుంటే తెలుగు మాధ్యమం కూడా ఉంటుంది). కరోనా నాలుగోదశ ముప్పు పొంచి ఉందన్న నివేదికలు వస్తున్నా.. వేసవి సెలవులు పొడిగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టీకరించింది.

Schools Reopened in Telangana 2022 : సర్కారీ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రారంభించనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు తరహాలో తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులందరికీ తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పుస్తకాలు అందించేందుకు రూ.120 కోట్లతో పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తయింది. విద్యార్థులకు 1.67 కోట్ల పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఉచితంగా యూనిఫాం, మధ్యాహ్నభోజన సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బడిబాటలో 70,698 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఈ కార్యక్రమం మరో వారం కొనసాగుతుందని విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్ని సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలకాలని ప్రభుత్వం సూచించింది.

పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లకు శుభాకాంక్షలు

నూతన విద్యాసంవత్సరం ప్రారంభం సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరికి ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు ఆంగ్లమాధ్యమ బోధన ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై శ్రద్ధపెట్టాలని సూచించారు. మన ఊరు-మనబడి కార్యక్రమానికి రూ.7,289.54కోట్లు ఖర్చుచేస్తున్నామని, తొలిదశలో రూ.3,497 కోట్ల ఖర్చుతో 9,123 పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులిచ్చిందని భాజపా నాయకులు అబద్ధాలు చెబుతున్నారని, బండి సంజయ్‌ పేర్కొన్నట్లు రూ.2700 కోట్లు ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, గిరిజన విశ్వవిద్యాలయం తీసుకువచ్చిన తరువాతే సంజయ్‌ మాట్లాడాలని మంత్రి సూచించారు. ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్‌ కళాశాలలు దేశమంతా ఇచ్చి, రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు.

ఫోన్లు తీసుకువస్తే జప్తే.. గురుకులాలూ సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సొసైటీలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశాయి. పాఠశాలల ప్రధాన గేటు వద్దే విద్యార్థుల లగేజీ క్షుణ్నంగా పరిశీలించాలని, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏమైనా ఉంటే వెంటనే జప్తు చేయాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ ఆదేశించారు. గురుకులాల్లో వెల్‌నెస్‌ సెంటర్లు అన్నీ పనిచేయాలని, ఖాళీ పోస్టులు ఉంటే వెంటనే ఆర్‌సీవోలు భర్తీ చేయాలని సూచించారు.

సెలవులకు టాటా.. హైదరాబాద్‌ బాట!

సెలవులకు టాటా.. హైదరాబాద్‌ బాట!

ఆదివారంతో పిల్లలకు వేసవి సెలవులు ముగియడం, సోమవారం నుంచి బడులు తెరవనుండడంతో.. స్వస్థలాలకు వెళ్లిన హైదరాబాద్‌ వాసులు తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో వరంగల్‌ జాతీయ రహదారిపై యాదగిరి టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. టోల్‌ ప్లాజా నుంచి సుమారు అర కిలోమీటరుకుపైగా వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Last Updated : Jun 13, 2022, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.