ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎట్టకేలకు షెడ్యూలు విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల జూనియర్ కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఎల్లుండి నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
ప్రైవేట్ కాలేజీలు ఇప్పటికే అనధికారికంగా ప్రవేశాలు నిర్వహించి... ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ, గురుకుల కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ జరగాల్సి ఉంది.