మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటు కోసం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1.50 కోట్ల విరాళంగా అందించింది. ఈ మేరకు సంబంధిత చెక్కును ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ కారా... ఆస్పత్రి యాజమాన్యానికి అందించారు. భారతదేశంలో క్యాన్సర్ విపరీతంగా పెరుగుతోందని... జీడీపీలో వైద్యారోగ్యంపై ఖర్చు పెంచాల్సిన అవసరం ఉందని దినేష్ కారా అభిప్రాయపడ్డారు.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారికి బ్యాంకు సీఎస్ఆర్ కార్యక్రమం కింద సహాయం చేస్తోందని తెలిపారు. కొవిడ్ వల్ల సమయానికి వైద్య సహాయం అందటం వల్ల జరిగే మేలును ప్రపంచం తెలుసుకుందన్నారు.
ఇదీచూడండి: 'జీఎస్టీలోకి పెట్రో ధరలు తెచ్చేందుకు ఇది సమయం కాదు'