ETV Bharat / city

Ttd: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఈసారి వారికేనట!

తితిదే సర్వదర్శనం టికెట్లను ఏపీ చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తోంది. ఈ విషయం తెలియక ఇతర ప్రాంతాల వారు టోకెన్లు పొందేందుకు ప్రయత్నించి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

sarvadarshana-tokens-are-for-chittoor-district-residents-only

author img

By

Published : Sep 12, 2021, 9:26 AM IST

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌లో ఏపీ చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను తితిదే జారీ చేస్తోంది. అయితే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయం తెలియక తిరుపతి వచ్చి టోకెన్లు పొందేందుకు ప్రయత్నించి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆయా రాష్ట్రాల భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని తితిదే విజ్ఞప్తి చేసింది.

తిరుమలలో సర్వదర్శనం టోకెన్లను తితిదే పునఃప్రారంభించింది.. రోజుకు రెండు వేల సర్వదర్శనం టికెట్లను జారీచేయనుంది . సర్వదర్శనం టికెట్లు ప్రస్తుతానికి చిత్తూరు జిల్లా భక్తులకే పరిమితం చేసింది. కరోనా దృష్ట్యా ఏప్రిల్ 11 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే నిలిపివేసిన తితిదే.. సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభించింది.

టికెట్ల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎన్ని రోజుల పాటు టిక్కెట్లు జారీ చేస్తారనే సమాచారంపై స్పష్టత లేకపోయినా.. సుదీర్ఘ విరామం తర్వాత టోకెన్లు ఇస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు . ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన భక్తులకు టోకెన్లను నిరాకరించింది. ఒకసారి దర్శనం అనంతరం నెల వ్యవధితో టోకెన్లు జారీ చేయనుంది.

ఇదీ చదవండి: Medicine from the sky : వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.