ETV Bharat / city

సంక్రాంతి పిడకలంట.. 280 అడుగులంట.!

తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలో భోగి నాడు వేసే మంటల కోసం.. ఆవు పేడతో పిడకలను తయారు చేసేందుకు పోటీ పడతారు. ఇందులో భాగంగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో బుచ్చమ్మ అగ్రహారానికి చెందిన 20 కుటుంబాలు.. 280 అడుగుల పొడవు గల భోగి పిడకల దండలు తయారు చేసి ఔరా అనిపించారు. భోగి రోజున ఈ దండను భోగిమంటల్లో వేసేందుకు సిద్ధం చేశారు.

sankranti celebrations
సంక్రాంతి పిడకలంట.. 280 అడుగులంట.!
author img

By

Published : Jan 11, 2021, 7:56 PM IST

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలో ఆచార సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింభిస్తాయి.

అందులో భాగంగా భోగి నాడు వేసే మంటల కోసం ఆవు పేడతో తయారు చేసిన పిడకల దండలను తయారు చేసేందుకు ప్రజలు పోటీపడతారు. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో బుచ్చమ్మ అగ్రహారానికి చెందిన 20 కుటుంబాలు.. 280 అడుగుల పొడవు గల భోగి పిడకల దండలు తయారు చేసి ఔరా అనిపించారు. వీటి కోసం 15 రోజుల నుంచి ఆవు పేడను సేకరించినట్లు పేర్కొన్నారు.

తెలుగు సంస్కృతి సంప్రదాయాలు.. సంక్రాంతి పర్వదినం విశిష్టతను పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తయారు చేసినట్లు తెలిపారు.

సంక్రాంతి పిడకలంట.. 280 అడుగులంట.!

ఇవీచూడండి: పెరిగిన బంగారం, వెండి ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.