Sankranti celebrations in Australia: నవ్య ఆంధ్ర తెలుగు అసోసియేషన్ (NATA) ఆధ్వర్యంలో.. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించేలా మహిళలు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. యువతులు, అతివలంతా కలిసి ఆడిపాడారు. అనంతరం పొంగలి, పిండి వంటలు చేశారు.
భారత సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం సంక్రాంతిని నిర్వహిస్తున్నామని.. నాటా ఫౌండర్ ప్రసాద్ తెలిపారు. కొవిడ్ నిబంధనల మధ్య కుటుంబసభ్యులు, మిత్రులు, పిల్లలు అందరూ పాల్గొని సంక్రాంతి పండుగను సరదాగా జరుపుకున్నామని తెలిపారు.
రాబోయే తరాల వారికి తెలుగు పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరముందని.. నాటా ప్రెసిడెంట్ సాహితి అన్నారు. కార్యక్రమంలో నాటా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భారత్లో కరోనా టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే..