కరోనా మహమ్మారి వ్యాపించకుండా ప్రభుత్వంలోని పలు విభాగాల సిబ్బంది కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నారు. జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి నేటి వరకు కూడా పోలీసులు అత్యంత బాధ్యయుతంగా పనిచేస్తున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్, సాయంత్రం నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ అమలులో పోలీసుల విధులు మరింత కీలకంగా మారాయి. వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి రాకుండా ఎప్పటికప్పుడు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. పెట్రోలింగ్ వాహనాల్లో కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ స్థానికులు గుమికూడకుండా కట్టడి చేస్తున్నారు.
ముందుకొచ్చిన మహావీర్ సంస్థ..
పెట్రోలింగ్ వాహనాలకు రసాయనాలతో శానిటైజేషన్ చేయాలని పోలీసులు అధికారులు నిర్ణయించారు. మహావీర్ సంస్థ నిర్వాహకులు ఇందుకోసం ముందుకు వచ్చారు. జంటనగరాల్లోని అన్ని పెట్రోలింగ్ వాహనాలను శానిటైజేషన్ చేస్తున్నారు. పెట్రోలింగ్ వాహనాలతో పాటు సిబ్బంది పర్యటించే ద్విచక్ర వాహనాలను కూడా శానిటైజ్ చేయాలని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సంస్థ నిర్వాహకులను కోరగా.. వారు అంగీకరించారు.
పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ వాహనాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఇవీ చూడండి: 30 శాతం కేసులకు తబ్లీగీనే కారణం.. 17 రాష్ట్రాల్లో ప్రభావం'