ఆంధ్రప్రదేశ్‌లోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి, నయవంచనకు గురయ్యామనే వేదన అందరినీ కలచి వేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నమ్మి వైకాపాకు 151మంది ఎమ్మెల్యేలను ఇచ్చి.. అధికారం కట్టబెడితే ఇప్పడు నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. ఇప్పుడు 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలుస్తుందని పవన్ స్పష్టం చేశారు. మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని ఉపాధి కల్పనా కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: KTR: పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం... గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ ప్రారంభం