ETV Bharat / city

Sambasiva Rao: ఫైబర్‌నెట్ కేసులో సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీఐడీ

ఫైబర్‌నెట్ కేసులో సాంబశివరావును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంబశివరావుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

author img

By

Published : Sep 18, 2021, 9:28 PM IST

sambasiva
ఫైబర్‌నెట్ కేసు

ఫైబర్‌నెట్ కేసులో సాంబశివరావును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంబశివరావుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఫైబర్‌నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా సాంబశివరావు పని చేశారు.

అసలేం జరిగిందంటే..?

ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. గతంలో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని పేర్కొంటూ.. ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా కేసును సీఐడీకి అప్పగించారు. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని ఆదేశించారు.

ఏపీ ఫైబర్ నెట్​కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రూ.121 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణలో గుర్తించామని.. ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్(APSFL) ఛైర్మన్ పి.గౌతమ్​రెడ్డి తెలిపారు. సాంకేతిక పరికరాలు సంస్థకు చేరకుండానే బిల్లులు మంజూరు చేశారని..వీటితో పాటు సాంకేతికపరంగా పలు రకాల అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్టు తొలగించారని.. దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 18 మందిని అనుమానితులుగా గుర్తించి సీఐడీ కేసులు నమోదు చేశారన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే సీఐడీ చర్యలు తీసుకుంటుందన్నారు.

నిందితులు వీరే..

నిందితుల జాబితాలో టెండర్ల సాంకేతిక మదింపు కమిటీకి అప్పట్లో సభ్యుడిగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌తో పాటు ఇన్‌క్యాప్‌ అప్పటి ఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ, దాని ఛైర్మన్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ కోటేశ్వరరావు, ఎండీ టి.గోపీచంద్‌, డైరెక్టర్లు ఆర్‌.ఎస్‌.బక్కనవర్‌, టి.హనుమాన్‌ చౌదరి, డా.టి.వి.లక్ష్మి, టి.బాపయ్య చౌదరి, టి.పవనదేవి, కె.రామారావు, హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ సంస్థ, దాని డైరెక్టర్లు ఎం.పి.శుక్లా, మహేంద్ర నెహతా, అరవింద్‌ ఖర్బందా, డా.ఆర్‌.ఎం.కస్తియా, రాజీవ్‌ శర్మ, బేలా బెనర్జీ ఉన్నారు. వీరితోపాటు కొందరు ప్రభుత్వోద్యోగులు, ఇతరులనూ నిందితులుగా పేర్కొంది. వారి పేర్లు ప్రస్తావించలేదు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.