ETV Bharat / city

TS - AP Water Disputes: సీమ కష్టాలు తెలుసని గతంలో కేసీఆర్ చెప్పారు: సజ్జల - Krishna River Management Board

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రయత్నాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అంగీకరించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నీటి విషయంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో.. కేసీఆర్ (cm kcr) చెప్పారని సజ్జల గుర్తు చేశారు.

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy
author img

By

Published : Jul 2, 2021, 5:37 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధానికి ఏపీ సీఎం జగన్ (cm jagan) లేఖ రాశారని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. జగన్‌ ప్రయత్నాన్ని కేసీఆర్ గతంలో అంగీకరించి, ప్రోత్సహించారని తెలిపారు.

'రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా ఉంటానని కేసీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నేనూ ఉన్నా. సీమ కష్టాలు తెలుసని, పరిష్కరించుకుందామని కేసీఆర్ చెప్పారు. నీటి విషయంలో ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలన్నారు.'

- సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారుడు

ప్రధానికి సీఎం జగన్ లేఖ.. ఏముందంటే..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ..ప్రధాని మోదీ (PM MODI) కి, కేంద్ర జల్​శక్తి మంత్రి షెకావత్‌ (Gajendra Singh Shekhawat)కు ఏపీ సీఎం జగన్ (cm jagan) వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని లేఖలో జగన్​ ఫిర్యాదు చేశారు. నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని జగన్‌ ఆక్షేపించారు. విద్యుదుత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని... శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని ప్రధానిని జగన్​ కోరారు. నీటి వినియోగం, పంపకాల విషయంలో కేఆర్‌ఎంబీ (KRMB) పరిధిని నిర్దేశించాలని విన్నవించారు. తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీ (Krishna River Management Board)కి రాసిన లేఖలనూ జగన్ జతపరిచారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.