ETV Bharat / city

సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం: సజ్జల - సజ్జల కామెంట్స్

Sajjala On AP employees strike notice: ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సమ్మె నోటీసిచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని పేర్కొన్నారు. చర్చలకు వస్తారని ఎదురుచూస్తున్నామన్నారు.

strike notice issued by ap employees
ఏపీ ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసు
author img

By

Published : Jan 24, 2022, 6:02 PM IST

Sajjala On AP employees strike notice: సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్న ఆయన.. ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఉద్యోగుల బుజ్జగింపు, చిన్న అంశాల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. చర్చలకు వస్తారని రేపు కూడా ఎదురుచూస్తామన్న సజ్జల.. ఈమేరకు మరోసారి సమాచారం పంపుతామని వెల్లడించారు.

"ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో నోటీసు పీరియడ్‌కు అర్థం ఉండదు. అలా చేస్తే క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగుల ప్రతినిధులకు చెప్పేందుకే కమిటీ. అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాలని కోరాం. పీఆర్సీ జీవోల అమలు నిలపాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలం. జీఏడీ కార్యదర్శి చెప్పాక కూడా అధికారిక కమిటీ కాదంటారా? ఉద్యోగులు కూడా మా ప్రభుత్వంలో భాగమే. ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం" - సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు

మంత్రుల ఎదురుచూపులు..

పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చకు వస్తాయని ఏపీ సచివాలయంలో మంత్రులు ఎదురుచూశారు. సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి నిరీక్షించారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ సహా వివిధ అంశాలపై ప్రభుత్వంతో సోమవారం సంప్రదింపులకు రావాలని మంత్రులు కోరగా ఉద్యోగ సంఘాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. చర్చలకు రాబోమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పినా మంత్రులు నిరీక్షించడం గమనార్హం.

ఇదీ చదవండి: AP Employees Strike: 'ఇదేదో ఆషామాషీ ఉద్యమం కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.