టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని సూచించింది.
అశ్వత్థామరెడ్డి ఏడాది కాలంగా విధులకు హాజరుకావడం లేదని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. వారం రోజుల్లో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్టీసీ ఆదేశించింది.