తాత్కాలిక ఉద్యోగులను పరుగుపెట్టించిన ఆర్టీసీ సిబ్బంది తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుంది. ఉదయం డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తుండగా... అక్కడికి తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఆందోళనకారులు వారి వెంటపడటం వల్ల ప్రాణ భయంతో మిగిలిన వారు పరుగుపెట్టారు. అనంతరం డిపోలో ఉన్న తాత్కాలిక కార్మికులను బయటకు పంపించాలని ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.
ఇవీ చూడండి: ఓయూలో ఉద్రిక్తత.. విద్యార్థులు, పోలీసుల వాగ్వాదం