New year Celebrations: రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులో 12 ఏళ్ల లోపు చిన్నారులు శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ స్పష్టం చేశారు. దాని వల్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ప్రయాణించే అవకాశం ఉంటుందని.. తద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉంటుందని బాజిరెడ్డి అభిప్రాయపడ్డారు. బస్‌భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పాల్గొన్నారు. ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ కలిసి కేక్ కట్ చేసి ఉద్యోగులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సంస్థలో ఉన్న ఒక్కో ఇబ్బందిని అధిగమించుకుంటూ ముందుకెళుతున్నామన్నామని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. పదవీవిమరణ పొందిన కుటుంబాల్లోని వారి అర్హతను బట్టి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. ఆర్టీసీని వృద్ధిలోకి తీసుకొచ్చే క్రమంలో ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి సూచించామన్నారు.
ఆర్టీసీ సంస్థ ప్రగతి పథంలో నడిచేందుకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషిచేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ప్రతి పనిలో ఆర్టీసీ సంక్షేమాన్ని చూడాలని ఉద్యోగులకు, కార్మికులకు సూచించారు. అందరూ సంస్థ అభివృద్దికి పునరంకితం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: