ఆర్టీసీ జేఏసీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాబ్ డ్రైవర్ల సమస్య పరిష్కరించినట్లుగా ఆర్టీసీ సమ్మెపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మెలో ఉండగా జారీచేసిన అద్దె బస్సుల టెండర్ల నోటీసులు రద్దు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. వేతనాలపై కోర్టుకు ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్మిక నేతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద ఆడియోలు ఉన్నాయన్నారు.
'ప్రభుత్వం స్పందించేలా గవర్నరే చొరవ చూపాలి' - rtc jat meet governer
ఆర్టీసీ నేతలను కొందరు ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చించేలా చొరవ తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్‌ను కోరారు.
!['ప్రభుత్వం స్పందించేలా గవర్నరే చొరవ చూపాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4824924-205-4824924-1571663401738.jpg?imwidth=3840)
ఆర్టీసీ జేఏసీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాబ్ డ్రైవర్ల సమస్య పరిష్కరించినట్లుగా ఆర్టీసీ సమ్మెపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మెలో ఉండగా జారీచేసిన అద్దె బస్సుల టెండర్ల నోటీసులు రద్దు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. వేతనాలపై కోర్టుకు ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్మిక నేతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద ఆడియోలు ఉన్నాయన్నారు.
TAGGED:
rtc jat meet governer