ETV Bharat / city

నేడు రాష్ట్రవ్యాప్త బంద్​

పదిహేను రోజుల పాటు నిరసనలు, ర్యాలీలతో ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన ఆర్టీసీ కార్మికులు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్​కు పిలుపునిచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల అప్రమత్తమయ్యారు. ప్రధాన కూడళ్లు, డిపోల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు.

నేడు రాష్ట్ర వ్యాప్త బంద్​
author img

By

Published : Oct 19, 2019, 5:26 AM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్​తో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె నేటికి పదిహేనో రోజుకు చేరింది. గత రెండు వారాలుగా ఆందోళనలు, ర్యాలీలు, వంటావార్పులు, మానవహారాలతో ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపిన కార్మికులు, ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్​కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ కార్మికులకు పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక యూనియన్లు మద్దతుగా నిలిచాయి. ఎలాగైన బంద్​ను విజయవంతం చేసేందుకు ఐకాస నేతలు.. సాదారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీసులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధాన డిపోల వద్ద భారీగా బలగాలను మోహరించారు.

ఇవీచూడండి: ఫిలిప్పీన్స్​ పరిస్థితి తీసుకురావొద్దు: హైకోర్టు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.