ETV Bharat / city

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ - దుర్గమ్మను దర్శించుకున్న ఆర్​ఎస్​ఎస్​ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ ‌సంఘ్‌ చీఫ్​‌ మోహన్‌ భగవత్​ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి మెుక్కులు చెల్లించుకొని.. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

rss chief mohan bhagavath visited vijayawada
దుర్గమ్మను దర్శించుకున్న ఆర్​ఎస్​ఎస్​ చీఫ్
author img

By

Published : Oct 10, 2020, 7:52 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్​‌ మోహన్‌ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మోహన్‌భగవత్‌కు ఆలయ ఈవో సురేష్‌బాబు ఆహ్వానం పలికారు.

ముఖ మండపం నుంచి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన పండితుల వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈవో సురేష్‌బాబు మోహన్​భగవత్​‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. రెండురోజులపాటు గుంటూరుజిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచారకుల భైఠక్‌లో పాల్గొనేందుకు మోహన్‌ భగవత్‌ శుక్రవారం విజయవాడ వచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.