విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు.. రహదారులు కోతకు గురవుతున్నాయి. పాడేరు నుంచి హుకుంపేట, పెదబయలు, ముంచింగిపుట్టు మండలాల నుంచి ఒడిశాకు వెళ్లే ప్రధాన రహదారి గుత్తులపుట్టు వద్ద కోతకు గురైంది. నిత్యం ఆర్టీసీ బస్సులు, వందలాది వాహనాలు.. సరిహద్దు నుంచి ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఆ సమయంలో ఎవరూ రోడ్డుపై లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. అయితే ప్రధాన రహదారి కోతతో రాకపోకలు నిలిచిపోయాయి.
చోడవరం సబ్ డివిజన్ కార్యాలయ పరిధిలో ఉన్న.. చోడవరం, దేవరాపల్లి, చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాల్లో 1,256 ఎకరాల్లో పంట పోలాలు నీట మునిగాయి. పెద్దేరు, కల్యాణపులోవ జలాశయాల గేట్లు ఎత్తడంతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.
ఇదీ చూడండి: car collided a container: తండ్రిని దుబాయ్ ఫ్లైటెక్కించి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి