ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల నివేదికపై కసరత్తు తుదిదశకు చేరుకుంది. మొత్తం ఖాళీల సంఖ్యకు సంబంధించి ఇప్పటికే స్పష్టత రాగా... కేడర్ స్ట్రెంత్, పనిచేస్తున్న ఉద్యోగులు, జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా ఖాళీల వివరాలపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా అన్ని శాఖలతో ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభమైంది. విద్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, ఇంధన, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు తదితర శాఖలకు సంబంధించి ఇవాళ సమీక్ష నిర్వహించారు.
సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమావేశమయ్యారు. ఖాళీలకు సంబంధించి స్పష్టమైన వివరాలపై సమావేశంలో చర్చించారు. రేపు, ఎల్లుండి కూడా మిగతా శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించి ఖాళీలకు సంబంధించి కచ్చితమైన, సమగ్ర నివేదిక రూపొందించనున్నారు.
ఇదీ చూడండి:
Rain Effect: చేపలకు బదులు కోళ్లు కొట్టుకొచ్చాయి.. ఆ గ్రామస్థులకు పండగే పండగ...