రెవెన్యూ శాఖ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా లోక్సభ ఎన్నికల అనంతరం దశలవారీ ఆందోళనలు చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీర్మానించింది. పనిభారం పెరిగినా, ఇబ్బందులు ఏర్పడినా ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులపై నిందలు తగవని పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే శాఖనే రద్దు చేయాలన్న ఆలోచన ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
సంస్కరణలు స్వాగతిస్తాం
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్ని సంస్కరణలు తెచ్చినా స్వాగతిస్తామని రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు. శాఖను రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి :'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి