ETV Bharat / city

మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి భాజపా ఎంతకైనా తెగిస్తుందన్న రేవంత్​రెడ్డి - భాజపా పై రేవంత్ ఫైర్

Revanth Reddy Tweet on Bjp రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా ఎంతకైనా తెగిస్తుందని ట్విట్టర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనం కోసం చూస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్‌ స్కామ్‌ను మరుగున పరచడానికే తెరాస గందరగోళం సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. యువతే తెరాస పతనానికి సైనికులై కదులుతారని రేవంత్ హెచ్చరించారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Aug 24, 2022, 5:00 PM IST

Revanth Reddy Tweet on Bjp: ట్విట్టర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి భాజపా, తెరాసపై విమర్శనాస్త్రాలు సంధించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం.. భాజపా ఎంతకైనా తెగిస్తుందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనిని ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాటలే ధృవీకరిస్తున్నాయని అయన ట్విట్టర్‌లో తెలిపారు. దిల్లీ లిక్కర్ కుంభకోణంలోని వాస్తవాలను మరుగున పరచడానికి తెరాస కృత్రిమంగా సృష్టిస్తున్న గందరగోళాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై.. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

  • అక్రమాలకు పాల్పడ్డ వారిపై,
    మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలి. 2/2

    — Revanth Reddy (@revanth_anumula) August 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Revanth Reddy Tweet on Trs: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై రేవంత్ మండిపడ్డారు. ట్రిపుల్​ ఐటీలో హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆర్జీయూకేటీలో జరిగే దారుణాలను ప్రభుత్వం కప్పిపెడుతోందని ఆయన ధ్వజమెత్తారు. నిజం వెలుగులోకి తేవడానికి వెళితే ప్రభుత్వం నిర్భందాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతే తెరాస పతనానికి సైనికులై కదులుతారని రేవంత్​రెడ్డి ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.

  • బాసర త్రిపుల్ ఐటీలో హక్కుల కోసం పోరాడిన విద్యార్థులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేదిస్తోంది. అక్కడ జరిగే దారుణాలను కప్పిపెడుతోంది. నిజం వెలుగులోకి తేవడానికి వెళితే నిర్భందాలు.

    ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా…
    ఈ యువతే మీ పతనానికి సైనికులై కదులుతారు… ఖబడ్దార్!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.