ETV Bharat / city

కాంగ్రెస్​లో నడుస్తోన్న వ్యక్తిగత విమర్శలపై రేవంత్​రెడ్డి స్పందన

Revanth Reddy Comments కాంగ్రెస్​లో నాయకుల మధ్య నడుస్తోన్న వ్యక్తిగత విమర్శలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పందించారు. ప్రజల సమస్యలపై, విధానాలపై మునుగోడులో చర్చ జరగాల్సి ఉందని వ్యక్తిగత దూషణలు అవసరం లేదని తెగేసి చెప్పారు.

Revanth Reddy response on leaders personal criticism in Congress

author img

By

Published : Aug 14, 2022, 3:46 PM IST

కాంగ్రెస్​లో నడుస్తోన్న వ్యక్తిగత విమర్శలపై రేవంత్​రెడ్డి స్పందన

Revanth Reddy Comments: మునుగోడు ఉపఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతుండడం వల్ల నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై, ధరల పెరుగుదల వల్ల పేదలపై పడ్డ భారం మీద చర్చ జరగాల్సి ఉందని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదలు బ్రతకలేని పరిస్థితి తెచ్చిందని కేంద్రపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెరాస, భాజపా ప్రభుత్వాల వల్ల మోసపోయామని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. 22 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మోదీ కేవలం ఏడు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు.

ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన భాధ్యత కాంగ్రెస్‌పై ఉందని రేవంత్​ తెలిపారు. భాజపా పాలనలో పేదలు, రైతులు, యువకులు మోసపోయారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 5000 కోట్ల ప్యాకేజీ ప్రకటించి భాజపా ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. చెప్పిందే చెప్పి కేసీఆర్ కూడా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలపై, విధానాలపై మునుగోడులో చర్చ జరగాల్సి ఉందని.. వ్యక్తిగత దూషణలు అవసరం లేదని తెగేసి చెప్పారు.

"మునుగోడు ఉప ఎన్నికల కోసం ప్రజా సమస్యల మీద కాకుండా వ్యక్తిగత విమర్శల పై చర్చ జరుగుతోంది. దీని వల్ల మునుగోడు ప్రజలకు నష్టం కేంద్ర, రాష్ట్ర విధానాల వల్ల పేదల పై పడ్డ భారం మీద చర్చ జరగాలి. ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన భాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. భాజపా పాలనలో పేదలు, రైతులు, యువకులు మోసపోయారు. 5000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వతనే భాజపా ఓట్లు అడగాలి. ఇంకోవైపు చెప్పిందే చెప్పి సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించని కేసీఆర్​కు ఓటు అడిగే హక్కు లేదు ప్రజల సమస్యలపై, విధానాలపై మునుగోడులో చర్చ జరగాలి వ్యక్తిగత దూషణలు అవసరం లేదు." - రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.