ETV Bharat / city

రాష్ట్రానికి గులాబీ చీడ పట్టుకుంది: రేవంత్‌ రెడ్డి - Revanth Reddy comments on kcr

Revanth Reddy on Telangana Formation day: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతో కోట్లాది మంది ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్విటర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Revanth Reddy on Telangana Formation day
రేవంత్ రెడ్డి
author img

By

Published : Jun 2, 2022, 1:00 PM IST

Revanth Reddy on Telangana Formation day: రాష్ట్ర ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోనియాగాంధీ చొరవతో అరవై ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రాష్ట్రం ఏర్పడిందన్నారు. వందలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రానికి... గులాబీ చీడ పట్టుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంసపాలన సాగిస్తున్న గులాబీ చీడను తరిమికొట్టాలని రేవంత్‌రెడ్డి కోరారు. రైతు ఆత్మహత్యలులేని, యువతకు ఉపాధి కల్పించే తెలంగాణ.. కాంగ్రెస్‌ స్వప్నమని తెలిపారు. సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ కోసం విశ్రమించకుండా శ్రమిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

‘‘వందల మంది త్యాగాల సాక్షిగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వపరిపాలన సుపరిపాలన అవుతుందని ఆశించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుంది. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలింది. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న గులాబీ చీడను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. రైతు ఆత్మహత్యలు లేని, యువతకు ఉపాధి కల్పించి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ.. కాంగ్రెస్ పార్టీ స్వప్నం. ఇందు కోసం పార్టీ విశ్రమించకుండా శ్రమిస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి ట్విటర్​లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 'అభివృద్ధిలో అద్భుతంగా దూసుకెళ్తున్న తెలంగాణకు సలామ్‌'

ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై పెత్తనం: కేసీఆర్

''మేజర్​' గురించి షాకింగ్ విషయాలు.. సందీప్ జీవితంలో అవి కూడా..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.