పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సన్మానసభలు నిర్వహిస్తూ.. గౌరవంగా వీడ్కోలు పలికే నిర్దిష్ట విధానాన్ని రూపొందించి పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఏడుగురు ఉద్యోగులకు సన్మానసభ నిర్వహించారు. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఉద్యోగి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని సీఎస్ తెలిపారు. ప్రభుత్వ వాహనాల్లోనే వారి గృహాల వద్ద దింపాలని ఆదేశించారు. ఉద్యోగుల సేవలను సోమేశ్ కుమార్ కొనియాడారు.
ఇదీ చూడండి: కేటీఆర్కు వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీకాంత్ కృతజ్ఞతలు