ETV Bharat / city

ఆ రాష్ట్రానికి వెళ్లే వాహనాలపై ఆంక్షలు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అన్ని రకాల కార్యకలాపాలూ కొనసాగాయి. ఆ తర్వాత నుంచి అత్యవసర సేవలు, మినహాయింపులు ఉన్నవి తప్ప మిగతా వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి.

Restrictions on vehicles going ap, ap curfew news today
ఆ రాష్ట్రానికి వెళ్లే వాహనాలపై ఆంక్షలు
author img

By

Published : May 6, 2021, 8:19 AM IST

ఏపీ రాష్ట్రానికి వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు. ఆ రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి వచ్చే ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఉన్న రంగాలకు చెందిన వారు, వైద్యం, ఇతర అత్యవసర సేవల కోసం బయటకొచ్చిన వారిని సంబంధిత పత్రాలను పరిశీలించి అనుమతిచ్చారు. రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొన్ని చోట్ల ఆటోలకు ప్రత్యేక పాసులు ఇచ్చి అనుమతిచ్చారు. ప్రయాణికుల వద్దనున్న టికెట్లు పరిశీలించిన అనంతరమే వారిని విడిచిపెట్టారు.

తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏపీ పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వాహనాలను మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతించారు. ఆ తర్వాత నుంచి అత్యవసర, సరకు రవాణా వాహనాలను మాత్రమే వదిలారు. వైద్యం, ఇతర అత్యవసర పనులపై వస్తున్న వారు సంబంధిత పత్రాలు, ఆధారాలు చూపిస్తేనే విడిచిపెట్టారు. మిగతా వారిని వెనక్కి పంపేశారు. ఆటోలు, ద్విచక్ర వాహనదారులను సైతం అనుమతించలేదు. లారీలను నల్లబండగూడెంలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద నిలిపేశారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై వాడపల్లి చెక్‌పోస్టుతో పాటు నాగార్జునసాగర్‌లోని ఏపీ, తెలంగాణ సరిహద్దులోనూ ప్రత్యేక చెక్‌పోస్టు పెట్టి వాహనాలు వెళ్లకుండా నియంత్రించారు.

ఖాళీగా ఎంజీబీఎస్‌

ఏపీలో రోజుకు 18 గంటల కర్ఫ్యూ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు అంతర్రాష్ట్ర సర్వీసులను నిలిపివేశాయి. వారం క్రితమే కర్ణాటక, మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు బంద్‌ కాగా.. బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నిలిపివేసినట్లు టీఎస్‌ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) యాదగిరి తెలిపారు. గతంలో తిరిగే జిల్లా సర్వీసులను తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని చివరి ప్రధాన బస్‌స్టాండు వరకే నడుపుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ బుధవారం బోసిపోయింది. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు కూడా చాలావరకు సర్వీసులను రద్దు చేశారు. ఏపీలో ఆర్టీసీ సర్వీసుల్లో 30 శాతంలోపే రోడ్డెక్కాయి. తిరుపతి-తిరుమల ఘాట్‌లో మధ్యాహ్నం తర్వాత కూడా బస్సులు నడిపేందుకు అనుమతించినప్పటికీ, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో పరిమితంగానే సర్వీసులు నడిపారు. బస్సులు మధ్యాహ్నం 12 గంటల వరకు నడుస్తాయనే ఉద్దేశంతో.. అనేకచోట్ల ఉదయం 11-11.30 గంటలు తర్వాత ప్రయాణికులు బస్టాండ్లకు చేరుకున్నారు. అయితే అప్పటికే సర్వీసులు నిలిపేయడంతో వారంతా అవస్థలు పడ్డారు.

దూర ప్రయాణాలకు రైల్వేనే ఆధారం

ఆర్టీసీ, ప్రైవేటు బస్సు సర్వీసుల నిలిపివేతతో.. దూర ప్రాంత ప్రయాణాలకు రైల్వేనే ఆధారంగా మారింది. రైలు టికెట్‌ చూపిస్తే.. రాత్రి కర్ఫ్యూలోనూ అనుమతిస్తుండడంతో ప్రయాణికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. గత ఏప్రిల్‌ నెలాఖరులో మాదిరి ఈసారి వలస కార్మికుల భారీ స్థాయిలో వెళ్లడంలేదని, ఏసీ కంటే స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణాలే ఎక్కువగా చేస్తున్నారని సికింద్రాబాద్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ జయరామ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆదరణ లేని కొన్ని మార్గాల్లో 10 రైళ్లను రద్దు చేసిన రైల్వే.. ఇదే సమయంలో గువహటి, రాక్సువల్‌, గోరక్‌పూర్‌, ధానాపూర్‌ ప్రాంతాలకు రోజూ నడిచే రైళ్లకు తోడు వారానికి ఒకటి చొప్పున అదనంగా నడుపుతోంది.

ఇదీ చూడండి: అతి భయం.. అతి ధీమా.. రెండూ ముప్పే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.