ETV Bharat / city

కొవిడ్‌ ఉద్ధృతి వేళ ఏపీలో ఆంక్షలు - corona cases in andhrapradhesh

కరోనా కట్టడికి ఏపీలో శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాకపోకలు, వాణిజ్య లావాదేవీలన్నింటిపైనా నిషేధాజ్ఞలు విధించింది. జిల్లాల్లో కర్ఫ్యూని పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు అత్యవసర సేవలను మాత్రమే అనుమతించారు.

ap curfew
కొవిడ్‌ ఉద్ధృతి వేళ ఏపీలో ఆంక్షలు
author img

By

Published : Apr 25, 2021, 7:47 AM IST

కొవిడ్‌ ఉద్ధృతి వేళ ఏపీలో ఆంక్షలు

కరోనా మహమ్మారి కట్టడికి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాకపోకలు, వాణిజ్య లావాదేవీలు అన్నింటిపైనా నిషేధాజ్ఞలు విధించింది. ప్రభుత్వం ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. విజయవాడలో రాత్రి ఎవరినీ రోడ్లపైకి అనుమతించలేదు. నగరంలో 80 పికెట్స్, 62 బీట్లు ఏర్పాటుచేశారు. పరిస్థితిని బట్టి మరింత పెంచుతామన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాత్రి వేళ కాలినడకన తిరుగుతూ సీఐ చైతన్య కృష్ణ కర్ఫ్యూని పర్యవేక్షించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు కర్ఫ్యూతో నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పోలీసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. తమ ఉద్యోగులకు నాలుగు షిప్టులు ఉన్నాయని వారు విధులకు వచ్చి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది.

నెల్లూరులో ప్రధాన కూడళ్లలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. అత్యవసర వాహనాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను మాత్రమే అనుమతించారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కర్ఫ్యూను ఎస్పీ పరిశీలించారు. అత్యవసర సేవల సిబ్బంది మినహా ఇతరులు రోడ్లపైకి రావొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప, కర్నూలు జిల్లాల్లోనూ పోలీసులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.

ఇవీచూడండి: పంజా విసురుతోన్న కరోనా... పాడెలెక్కుతున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.