సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ సమస్యతో రెండు రోజులుగా నత్తనడకన సాగుతున్న రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. ఇవాళ ఇప్పటి వరకూ ఇంకా సర్వర్ కనెక్ట్ కాలేదు. దీంతో క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో మధ్యాహ్నం వరకే ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీనిపై రిజిస్ట్రేషన్ల పరిపాలనా డీఐజీ సుభాషిణీ స్పందించారు. సర్వర్ సమస్యతో రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా సాగుతున్నాయనితెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఐటీ విభాగం శ్రమిస్తోందని వివరించారు. ఇవాళ పూర్తిగా ఆగిపోవడంతో….ఇప్పటికే స్లాట్ బుకింక్ చేసుకున్న వారికి మరో తేదీని ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: Tammineni: 'ఈటల.. భాజపా పంచన చేరటం సిగ్గుచేటు'