రైతులు ఏ పంట సాగు చేశారనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు జులై 31 వరకూ గడువు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. దీనిపై ప్రతీ రైతు సెల్‌ఫోన్‌కు శుక్రవారం సంక్షిప్త సందేశాలను పంపించినట్లు వెల్లడించారు. ఈ వివరాల నమోదు ఆధారంగానే వచ్చే అక్టోబరు నుంచి వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వం పంటలను మద్దతు ధరకు కొంటుందని స్పష్టం చేశారు.
ఎవరైనా సాగుచేసిన పంట వివరాలు నమోదు చేయించకపోతే దానిని మద్దతు ధరకు కొనబోమని స్పష్టం చేశారు. పంట వేయలేదని నమోదైతే వచ్చే అక్టోబరులో మొదలయ్యే యాసంగి సీజన్‌లో రైతుబంధు సొమ్ము ప్రభుత్వం ఇవ్వదనే ప్రచారం జరుగుతోంది నిజమేనా అని ఆయన్ను ‘ఈనాడు’ వివరణ అడగ్గా.. అలాంటిదేమీ లేదన్నారు. మద్దతు ధరకు పంటలను కొనడానికి మాత్రమే ఈ వివరాలను సేకరిస్తున్నామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండిః కొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే