రంగారెడ్డి జిల్లా పరిధిలో బాణాసంచా దుకాణదారులకు అనుమతులు ఇవ్వడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది లంచం అడిగితే ... తమకు సమాచారం ఇవ్వాలని అనిశా అధికారులు తెలిపారు. కొంతమంది సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు.
బాధితులెవరైనా 9440446140, 9440446143, 9440808109 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి: గ్రామీణ సంఘాలకు ఒకశాతం వడ్డీకే రుణాలిస్తున్నాం: నాబార్డ్ ఛైర్మన్