Rajasingh comments on munawar show: ముస్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ కామెడీ షో నిర్వాహణపై గందరగోళం నెలకొంది. శిల్పకళావేదికలో శనివారం షో నిర్వహణకు ఇప్పటికే కొన్ని టిక్కెట్లు... షో నిర్వాహకులు విక్రయించారు. కార్యక్రమం ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని ఇప్పటికే భాజపా, బీజేవైఎం నేతలు హెచ్చరించారు. ఇదే విషయంలో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గృహనిర్బందం చేసే ప్రయత్నం చేశారు.
ఆయన తన నివాసం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అయితే మునావర్ ఫారుఖీ కామెడీ షోకు అనుమతి ఇచ్చారా లేదా అనే విషయం ఇంకా పోలీసు అధికారులు స్పష్టం చేయడం లేదు. ఈ విషయమై వారు మాట్లాడడం లేదు. షో ఏర్పాటు కోసం శిల్పకళా వేదికకు డబ్బులు చెల్లించలేదని శిల్పారామం అధికారులు తెలిపారు. మరోవైపు ఇప్పటికే భాజపాకి చెందిన పలువురు కార్యకర్తలు షోకు హాజరయ్యేందుకు టిక్కెట్లు కొనుగోలు చేశారని జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. షో కొనసాగుతుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన షోను అడ్డుకుంటామని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. డోంగ్రి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తూ, టికెట్లు అయిపోయాయని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి: