కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రగుంట్ల వద్దనున్న ఆర్టీపీపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది.
నిన్న ఉదయం కురిసిన వర్షానికి విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5,6 యూనిట్లలోకి వర్షపు నీరు చేరడంతో విద్యుత్ మోటార్లు, యంత్ర సామగ్రి నీట మునిగాయి. అప్రమత్తమైన ఆర్టీపీపీ అధికారులు, సిబ్బంది.. యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీరు పంపింగ్ కు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి : పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం