ETV Bharat / city

ఏపీలో దంచికొడుతున్న వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు - rains in ap today

RAINS IN AP: ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. నిన్న అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురవగా నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెరవాడ వాగు దాటేందుకు వెళ్తున్న ఐదుగురిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

RAINS IN AP
దంచికొడుతున్న వానలు
author img

By

Published : Aug 2, 2022, 2:23 PM IST

RAINS IN AP: ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. జూపాడు బంగ్లా మండలంలో శుద్ధ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో వాగు ఉద్ధృతంగా పారుతోంది. వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో ఉన్న వాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. గడివేముల మండలం గని గ్రామంలో వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఓర్వకల్లు మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. కర్నూలు నగరంలో అర్థ రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకు పైగా గా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని శ్రీరామ్ నగర్​లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలూరు మండలంలో భారీ వర్షం కురిసింది.

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో భారీ వర్షం కురిసింది. పెద్దఎత్తున వరద నీరు రావడంతో చాలా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి సామగ్రి మొత్తం తడిచిపోయింది. బలదురులో గర్జివంక పొంగిపొర్లుతోంది. వరద నీటికి పంటపొలాలు మొత్తం నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి కురిసిన వర్షాలకు కర్నూలులోని నెరవాడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటేందుకు వెళ్తున్న ఐదుగురిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.