ETV Bharat / city

తౌక్టే ఎఫెక్ట్ : ఏపీలో వర్షాలు.. అన్నదాతలకు నష్టాలు

author img

By

Published : May 17, 2021, 10:35 AM IST

తౌక్టే తుపాను ప్రభావంతో ఏపీలో వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాలవర్షం అన్నదాతలను నష్టపరచగా... పొలాలు, కళ్లాల్లో ఎండబెట్టిన పంటను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. తుపాను ప్రభావంతో... సోమ, మంగళవారాల్లోనూ వర్షం కురిసే అవకాశముంది.

taukte cyclone, taukte cyclone effect, taukte cyclone effect in ap
తౌక్టే తుపాను, ఏపీలో తౌక్టే తుపాను, ఏపీలో తౌక్టే తుపాను ప్రభావం
తౌక్టే ఎఫెక్ట్ : ఏపీలో వర్షాలు

తౌక్టే తుపాను ఏపీపైనా ప్రభావం చూపుతోంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం తక్కువ ఎత్తులో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదైంది. పలుచోట్ల గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పశ్చిమగోదావరిలో కురిసిన వర్షానికి అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు సమీపంలోని పలు గ్రామాల్లో.. రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు లేకపోవటంతో గోడౌన్లలో దాచుకోలేక.. కళ్లాల్లో ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ప్రభుత్వం తమ కష్టం అర్థం చేసుకుని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. తడిసిన ధాన్యం బస్తాలతో రైతులు ధర్నా నిర్వహించారు. 40 శాతం పంట కళ్లాల్లోనే ఉండిపోయిందని.. కౌలు రైతుల వద్ద నుంచీ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

చల్లబడ్డ కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వీరులపాడులో కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అన్నదాతలను ఇక్కట్లకు గురిచేసింది. పొలాలు, కళ్లాల్లో ఎండబెట్టిన మొక్కజొన్న, వరిపంట తడవకుండా కాపాడుకునేందుకు పరుగులుతీశారు. అప్పటికీ కొంత పంట తడిసిపోవటంతో నిరాశకు గురయ్యారు. వాహనదారులనూ వర్షం ఇబ్బందులకు గురిచేసింది. చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది.

జలమయం...

విశాఖ జిల్లా పాయకరావుపేటలో గంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపునీరు నిలిచిపోవటంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరులో దాదాపు గంటపాటు మోస్తరుగా వర్షం కురిసింది. కొద్దిరోజులుగా ఎండవేడిమికి విలవిల్లాడిన ప్రజలు చల్లనిగాలులను ఆస్వాదిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.