ETV Bharat / city

ప్రత్యేక రైళ్లలో ఆర్‌ఏసీ టికెట్లు.. రైల్వేశాఖ నిర్ణయం - ప్రత్యేక రైళ్లలో ఆర్‌ఏసీ టికెట్లు

ఒక బెర్తు ఒక ప్రయాణికుడికే అన్న నిబంధనలను సడలించి ఆర్‌ఏసీ టికెట్లు, పాక్షిక నిరీక్షణ జాబితా టికెట్లు కూడా జారీచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వీటితోపాటు రిజర్వేషన్లలో తత్కాల్‌ కోటాను తీసుకురాబోతుంది. కొత్త నిబంధనలు జూన్‌ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.

train
train
author img

By

Published : Jun 10, 2020, 11:59 AM IST

ప్రత్యేక రైళ్ల ప్రయాణంలో వ్యక్తిగత దూరం నిబంధనల్ని రైల్వేశాఖ క్రమంగా సడలిస్తోంది. రిజర్వేషన్‌ ఖరారయ్యాకే ప్రయాణ అనుమతి, ఒక బెర్తు ఒక ప్రయాణికుడికే అన్న నిబంధనలను సడలించి ఆర్‌ఏసీ టికెట్లు, పాక్షిక నిరీక్షణ జాబితా టికెట్లు కూడా జారీచేయాలని నిర్ణయించింది. వీటితోపాటు రిజర్వేషన్లలో తత్కాల్‌ కోటాను తీసుకురాబోతుంది. కొత్త నిబంధనలు జూన్‌ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న తరుణంలో రైల్వేశాఖ తాజా నిర్ణయం సరైంది కాదని నిపుణులు తప్పుబడుతున్నారు.

బోగీలో 72కు బదులు 80-90 మంది

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 22 నుంచి ప్రయాణికుల రైళ్లను రద్దుచేసిన రైల్వేశాఖ.. ఆ తర్వాత 30 రాజధాని రైళ్లను, 200 ఇతర రైళ్లను రెండు విడతలుగా పట్టాలు ఎక్కించింది. మొత్తం 230 రైళ్లను ‘ప్రత్యేక’ పేరుతో నడిపిస్తోంది.

స్లీపర్‌ బోగీలో 72 బెర్తులుంటాయి. ఆ లెక్కన బెర్తుకు ఒకరి చొప్పున 72 మందికే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. కొత్త నిబంధనలతో ఆర్‌ఏసీ టికెట్లూ జారీచేస్తారు. దీంతో సైడ్‌లోయర్‌లో ఒక బెర్తును ఇద్దరు పంచుకోవాలి. ఈ విధంగా బోగీలో 8 మంది పెరిగి ప్రయాణికుల సంఖ్య 80కి చేరుకుంటుంది.

పాక్షిక వెయిటింగ్‌ లిస్ట్‌లో ఒకే పీఎన్‌ఆర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉండి వారిలో ముగ్గురికి రిజర్వేషన్‌ ఖరారై, మిగతావారు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే.. కొత్త నిబంధనల ప్రకారం వారినీ రైల్వేశాఖ ప్రయాణానికి అనుమతించనుంది. ఇలాంటి పీఎన్‌ఆర్‌ నంబర్లు బోగీకి మూడు, నాలుగు ఉన్నా అదనంగా మరో 10 మంది వరకు పెరుగుతారు.

ఈ సమయంలో కక్కుర్తి వ్యవహారమా?

‘‘బెర్తుల వరకే ప్రయాణికుల్ని అనుమతిస్తున్నా రైలు ప్రయాణికుల్లో కొవిడ్‌-19 కేసులు వస్తున్నాయి... ఇక నిబంధనలు సడలించి 72 మంది ప్రయాణించాల్సిన చోట 80-90 ప్రయాణికుల్ని అనుమతిస్తే కేసులు పెరగవా? కరోనా వేళ కాసుల కక్కుర్తి ఏంటి?’’ అని ఓ రైల్వే నిపుణుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తత్కాల్‌ పేరుతో ప్రత్యేక బాదుడు

ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లలో అన్ని బెర్తులను రైల్వేశాఖ రెగ్యులర్‌ కోటా కిందే ఇస్తూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తోంది. 29 నుంచి తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ మొదలుకానుంది. ఆ మరుసటి రోజు నుంచి ప్రయాణించే వారిపై తత్కాల్‌ బాదుడుకు రైల్వేశాఖ సిద్ధం అవుతోంది. తత్కాల్‌ కోటాలో స్లీపర్‌ బోగీల్లో 30 శాతంపైగా బెర్తులుంటాయి. బోగీలో 72 బెర్తులు ఉంటే 24 తత్కాల్‌ కోటాకు వెళ్తాయి.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: పిల్లల మారాం.. తల్లిదండ్రులకు తలనొప్పి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.