ETV Bharat / city

RRR Challenge to AP Govt: "పదిసార్లు ఆ పదం పలకండి చాలు.. నేనే రాజీనామా చేస్తా" - ap latest news

RRR Challenge to AP Govt: ఏపీ ప్రభుత్వానికి రెబల్​ ఎంపీ రఘురామరాజు సవాల్​ విసిరారు. నాపై అనర్హత వేటు వేసేందుకు మరో అవకాశమిస్తున్నట్లు ప్రకటించారు. మీ వల్ల కాకపోతే రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్తానని స్పష్టం చేశారు. ఒకవేళ గెలవకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

RRR Challenge to AP Govt
ఏపీ ప్రభుత్వానికి రెబల్​ ఎంపీ రఘురామరాజు సవాల్
author img

By

Published : Jan 10, 2022, 5:28 PM IST

RRR Challenge to AP Govt: ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించేందుకు వైకాపాకు అవకాశం ఇస్తున్నట్లు.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. అప్పటి వరకు అనర్హత వేటు వేయించకపోతే.. రాజీనామా చేస్తానని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్తానని, భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గెలవకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

MP fire on ap govt: అయితే.. తాను గెలిస్తే మాత్రం సీఎం జగన్‌ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని.. రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రెండు రోజులు.. పోలీసులు తనకు భద్రత కల్పించాలన్నారు. అధికారులు తన ప్రతి కదలికనూ వీడియో తీస్తారని చెప్పారు. రెండు రోజులూ ఇంటి వద్దనే ఉండి వచ్చిన వారిని పలకరించి పంపుతానని ఎంపీ చెప్పారు. అమరావతి కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు.

ఏపీ ప్రభుత్వానికి రెబల్​ ఎంపీ రఘురామరాజు సవాల్​

ఫిబ్రవరి 5 వరకు టైం ఇస్తున్నా. ఆ లోపు చేయకపోతే మీకు చేతగాని వాళ్లుగా భావిస్తా. ఈలోపే నేను రాజీనామా చేయాలనుకుంటే సీఎం జగన్​ మోహన్​ రెడ్డి పదిసార్లు అనర్హత అని పలికితే చాలు. స్పీకర్​ నాపై అనర్హత వేసినట్లుగా భావిస్తా. లేదంటే నేను గెలిచిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసి మరొకరికి అప్పగించాలి. ఈనెల 13న నేను నా నియోజకవర్గానికి వెళ్తున్నా. - రఘురామ, వైకాపా ఎంపీ

support to sachivalayam employees: సచివాలయ ఉద్యోగుల అందోళనకు.. ఎంపీ రఘరామ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సచివాలయ ఉద్యోగులను.. మండల రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేసులు పెడితే.. భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

RRR on Jobs: రాష్ట్రంలో.. రేషన్, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసేశారని మండిపడ్డారు. ఏటా జనవరిలో ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించిన రఘురామ.. రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. మద్యం తయారీలో ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు చేశారు.

comments on Sajjala: ప్రభుత్వ మరో సలహదారునిగా జ్ఞానేంద్ర రెడ్డిని నియమించారని, ఆయన వల్ల ఉపయోగం ఏంటని ఎంపీ ప్రశ్నించారు. ప్రభుత్వానికి అదనపు ఖర్చు తప్ప.. ఎలాంటి ప్రయోజనమూ లేదని దుయ్యబట్టారు. సీఎం జగన్.. ఒకే సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీఠ వేస్తున్నారని ఆరోపణలు చేశారు. మిగిలిన సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.