విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ... అంబర్‌పేట కార్ హెడ్ క్వార్టర్స్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ నివాళులు అర్పించారు. భారత్-చైనా సరిహద్దులోని అక్సాయ్ చిన్ వద్ద 1959 అక్టోబర్ 21న జరిగిన ఘటనలో విరోచితంగా పోరాడి అమరుల జ్ఞాపకార్థంగా ఏటా పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈ ఏడాది నుంచి వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీస్ కుటుంబాలకు భరోసా కల్పిస్తూ వాళ్ళకి ఆర్థిక సాయం, రక్షణ కల్పిస్తున్నామని కమిషనర్ సీపీ తెలిపారు. అమరుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో... 1500 మంది సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సుదీర్ బాబు, అడిషనల్ డీసీపీలు, శంకర్ నాయక్, షమీర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి