ETV Bharat / city

ఒక కుందేలు.. 16 పిల్లలు..! - కర్నూలు జిల్లా కుందేళ్లు వార్తలు

కుందేలు సాధారణంగా ఒకేసారి 4లేదా 8 కుందేళ్లకు జన్మనిస్తుంది. కానీ ఏపీలోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద వంగలి గ్రామంలో ఆ కుందేలు మాత్రం ఏకంగా 16 కుందేళ్లకు జన్మనిచ్చింది. ఈ బుజ్జి బుజ్జి కుందేళ్లను చేసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలు వారు ఎగబడుతున్నారు.

rabbit-gave-birth-to-16-small-rabbits-in-kurnool-dst-in-one-delivery
ఒక కుందేలు.. 16 పిల్లలు..!
author img

By

Published : Sep 4, 2020, 1:57 PM IST

ఒక కుందేలు.. 16 పిల్లలు..!

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద వంగలి గ్రామంలో అన్వర్ భాష అనే వ్యక్తి పెంచుతున్న కుందేలుకు ఒకే ఈతలో 16 పిల్లలు పుట్టాయి. కుందేళ్ల పెంపకాన్ని అన్వర్ బాషా అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన పెంచుతున్న ఒక కుందేలు శుక్రవారం వేకువజామున ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది.

ఆ బుజ్జి కుందేళ్లను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన అని ఆళ్లగడ్డ పశు వైద్యులు డాక్టర్ రామసుబ్బారెడ్డి అన్నారు. సాధారణంగా ఓ కుందేలు 4, లేదా 8 పిల్లలకు జన్మనిస్తుందని, అరుదుగా 12 కుందేళ్లకు జన్మనిచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఒకే ఈతలో 16 కుందేళ్లకు జన్మనివ్వటం చాలా చాలా అరుదన్నారు.

ఇవీ చూడండి: విలేజ్ లెర్నింగ్​ సెంటర్లలో విద్యార్థులకు పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.