అడవుల్లో కనిపించే కొండచిలువ.. జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిమరి మండలం పెద్దకోట్లలో జరిగిందీ ఘటన. కొండచిలువను చూసిన గ్రామస్థులు పరుగులు తీశారు. కొందరు యువకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. సిబ్బంది అక్కడకు చేరుకుని కొండచిలువను బంధించారు.
చిత్రావతి జలాశయంలోకి 10 టీఎంసీల నీరు నింపడం వల్ల.. ఆ ప్రాంతంలో ఉన్న కొండచిలువలు, పాములు పెద్దకోట్ల గ్రామంలోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆడ శిశువును ఆసుపత్రిలో వదిలేసిపోయిన వృద్ధురాలు