ETV Bharat / city

PV Sindhu: ఏపీ సీఎం జగన్​ను కలిసిన పీవీ సింధు.. భారీ నగదు పురస్కారం - pv sindhu on vizag badminton academy

టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సచివాలయానికి వచ్చిన సింధును.. జగన్‌, మంత్రులు అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 30 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ఆమెకు అందించారు.

PV Sindhu
PV Sindhu
author img

By

Published : Aug 6, 2021, 2:24 PM IST

టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ.సింధు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సచివాలయానికి వచ్చిన సింధును.. ఆ రాష్ట్ర సీఎం జగన్‌, మంత్రులు అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న 30లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ఆమెకు అందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

జగన్​ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సింధూ ఒలింపిక్స్‌కు వెళ్లేముందు పతకంతో తిరిగి రావాలని సీఎం ప్రోత్సహించారని తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పతకాల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని సింధు చెప్పారు.

  • The CM has urged PV Sindhu to start the proposed Badminton academy in Vizag soon and nurture more youngsters like her. Officials handed over a cash reward of Rs. 30 lakhs to PV Sindhu on behalf of the Government of Andhra Pradesh. 2/2 pic.twitter.com/IlKGcosGBK

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఒలింపిక్స్‌లో కాంస్య పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు సత్తా చాటింది. చైనాకు చెందిన బింగ్జియావోపై ఆది నుంచీ దూకుడుగా ఆడిన సింధు.. తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ నుంచే సింధు ఆధిపత్యం కొనసాగింది. పదునైన స్మాష్‌లతో విరుచుకుపడిన హైదరాబాద్‌ షట్లర్‌.. తొలుత 5-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా మళ్లీ పుంజుకున్న సింధు.. తొలిగేమ్‌ను 21-13తో గెలుచుకుంది.

ఇది చదవండి: సింధుకు ఒలింపిక్ పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.