ETV Bharat / city

Drinker: చనిపోయాడకున్నారు...అంతలోనే... - ప్రకాశం జిల్లా పోలీసులు

కాలువ నీటిలో కదలకుండా..మెదలకుండా పడి ఉన్న ఓ వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఏమోనని భావించి ఫొటోలు కూడా వాట్సప్ ద్వారా పంపారు. అప్రమత్తమైన రక్షకభటులు అక్కడకు వచ్చారు. నీటిలో దిగి మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా చటుక్కున లేచి నిలబడ్డాడు. అంతా ఒక్కసారిగా హడలిపోయారు. మద్యం మత్తులో అలా పడుకున్నానని తాపీగా చెప్పాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

Drinker
Drinker
author img

By

Published : Oct 4, 2021, 9:30 AM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా సంతమాగునూరు స్థానికులకు పోలీసులకు ఓ వింత ఘటన ఎదురయ్యింది. సాగునీటి కాలువ సమీపంలోని నీటిలో ఓ మృతదేహం ఉందంటూ పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వాట్సప్​లో ఫొటోలు కూడా పంపారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు కొంతమంది సహాయకులతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నీటిలో దిగి మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నం చేయగా... చటుక్కున లేచి నిలబడి అందరినీ హడలెత్తించాడా వ్యక్తి. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతమాగునూరు మండలంలో జరిగింది.

అసలేంజరిగిందంటే....

జిల్లాలోని వెలిగండ్ల మండలానికి చెందిన నాగేశ్వరరావు ఫూటుగా తాగి, మద్యం మత్తులో సంతమాగులూరు సమీపంలోని వాగులో, గడ్డి పొదలు మధ్యలో పడిపోయాడు. ఎప్పుడు పడిపోయాడో తెలీదుగాని కదలకుండా అలా ఉండడాన్ని గమనించిన స్థానికులు ఎవరో కాలువలో పడి చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు... నీటిలో తేలుతున్నట్లుగా ఉన్నట్లు ఓ ఫొటో కూడా తీసి పోలీసులకు పంపించారు... పోలీసులు మరికొంతమంది సహాయకులను, పెద్దమనుషులను తీసుకువెళ్లి.. మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేశారు.

నీటిలో కష్టంగా దిగి, ఆ వ్యక్తిని ఎత్తే ప్రయత్నం చేయగా చటుక్కున లేచి నిలబడ్డాడు. మృతి చెందాడనుకున్న వ్యక్తి లేచి నిలబడటంతో ఒక్క సారి ఖంగుతున్నారు. తాగి పడిపోయాడని తెలుసుకొని, ఒడ్డుమీదకు తీసుకు వచ్చారు. మత్తులో కూతుర్ని చూడ్డానికి వచ్చానని చెప్పడంతో విషయం గ్రహించిన పోలీసులు...నాగేశ్వరరావును గ్రామంలో విడిచిపెట్టి ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు.

చనిపోయాడకున్నారు...అంతలోనే లేచి నిలబడ్డాడు...

ఇదీ చదవండి : MINOR GIRL RAPED: మద్య మత్తులో కన్న కూతురిపైనే దారుణం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.