ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రాన్నిదేవాదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. కోదండరాముని ఆలయం, నీటి మడుగును పరిశీలించిన అనంతరం రామతీర్థం దేవస్థానం అధికారులతో ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు.
అనంతరం ఆ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ.. కోదండరాముని విగ్రహం ధ్వంసం కావడంతో నూతన ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ సామగ్రి ఎంత అవసరమో.. అన్నదాంతోపాటు ఇతర అంచనాలు వేశామన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.